పెళ్లికి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం

67చూసినవారు
పెళ్లికి వెళ్లి వస్తుండగా.. ఘోర ప్రమాదం
AP: ప్రకాశం జిల్లా కుంభం మండలం ఎర్రబాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్