నదిలో దూకిన వివాహిత.. రక్షించిన పోలీసులు

72చూసినవారు
నదిలో దూకిన వివాహిత.. రక్షించిన పోలీసులు
చిలకలూరిపేటకు చెందిన ఓ వివాహిత తన భర్తతో గొడవపడి ఇంటి నుంచి మంగళవారం విజయవాడకు వచ్చింది. అక్కడి నుంచి తన తమ్ముడు ద్విచక్రవాహనంపై తాడేపల్లిలోని బందువుల నివాసానికి బయలుదేరారు. ఈక్రమంలో తాడేపల్లి కనకదుర్గమ్మ వారధిపై వాహనం దిగి కృష్ణా నదిలో దూకింది. గమనించిన తాడేపల్లి ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఎస్ఐ నారాయణకు సమాచారం ఇవ్వగా ప్రాతూరు గ్రామస్థుల సహాయంతో ఆమెను కాపాడి మణిపాల్ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్