వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని శుక్రవారం విజయపురిసౌత్ ఎస్సై షేక్ మొహమ్మద్ తెలిపారు. చవితి ఉత్సవాలు ప్రజలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఎటువంటి రాగ ద్వేషాలకి తావివ్వకుండా చూసుకోవాలని, సంతోషకర వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ వివాదాలు లేకుండా జరుపుకోవాలని అయన అన్నారు.