శావల్యాపురం మండల పరిధిలోని వేల్పూరు గ్రామంలో నాబార్డ్ మరియు సెర్చ్ ఆధ్వర్యంలో గురువారం రైతు ఉత్పత్తిదారుల సంఘం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఓ మాడెబోయిన గురు ప్రసాద్ మాట్లాడుతూ రైతులందరూ సంఘాలుగా ఏర్పడటం వలన మరిన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఉందని తెలిపారు, అలాగే వ్యవసాయానికి కావలసిన విత్తనాలు ఎరువులు యంత్ర సామాగ్రీ ఉమ్మడిగా తెచ్చుకోవటం వలన ఆర్థికంగా ఖర్చులను మరియు పని భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు.