పల్నాడు జిల్లా మాచర్ల మండలం రాయవరం జంక్షన్ వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి దుర్గి మండలం మహబూబ్ నగర్ కాలనీకి చెందిన పల్లేటి అబ్రహం అనే వ్యక్తి నుంచి 18 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేశారు. వారిని మాచర్ల కోర్టులో హాజరపరచడం జరుగుతుందని తెలిపారు.