మాచర్ల పట్టణంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అప్పుడే పుట్టిన శిశువు బొడ్డు కట్ చేయబోయి కాలు వేళ్ళు కోశారనే పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై మంగళవారం సాయంత్రం శిశువు బంధువులు స్పందించారు. బిడ్డకి సర్జరీ చేసినప్పుడు చిన్న గాయమైందని, బిడ్డ బాగానే ఉందన్నారు. హాస్పటల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఏమీ లేదని, వైద్య సిబ్బంది అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారన్నారు. అసత్యాలు ప్రచారం చేయవద్దని కోరారు.