విజయవాడలోని వరద ముంపు బాధితులకు అభినందన సంస్థ చైర్మన్, పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ ఆధ్వర్యంలో ఆహార పదార్థాలను శుక్రవారం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు ఆయన స్పందించారు. విజయవాడలో వరద ముంపు బాధితులకు బిస్కెట్స్, ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అందజేశారు.