గొప్ప సామాజిక తత్వవేత్త సంస్కరణవాది మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు అమరావతిలో గురువారం ఘనంగా నిర్వహించారు. అమరావతిలోని సిపిఎం కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం అమరావతి మండల కార్యదర్శి సూరిబాబు, కెవిపిఎస్ నాయకులు బాబురావు, ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.