వ్యర్ధాలు రోడ్లపై వేస్తే చర్యలు తప్పవు: కమిషనర్ రమేష్ బాబు

67చూసినవారు
వ్యర్ధాలు రోడ్లపై వేస్తే చర్యలు తప్పవు: కమిషనర్ రమేష్ బాబు
పొన్నూరు పట్టణంలోని కొప్పాక వెంకయ్య కూరగాయల మార్కెట్ ను బుధవారం కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు. మార్కెట్లో చెత్త వ్యర్ధాలు రోడ్లపై వేయటం గమనించిన కమిషనర్ వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా మార్కెట్ పరిశుభ్రంగా ఉంచాలని చెత్త వ్యర్ధాలు రోడ్లపై వేస్తే వ్యాపారస్తులకు అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు. మార్కెట్ ముందు ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్