సత్తెనపల్లిలో వ్యాపారుల షాపుల వద్దకు వచ్చే హిజ్రాలు గుంపుగా ఏర్పడి ఇబ్బందులు గురి చేస్తున్నారని బుధవారం వ్యాపారస్తులు వాపోయారు. ప్రతిరోజు ఏదో ఒక బ్యాచ్ రావడం షాపుల వద్దకు వెళ్లి పండగలు వస్తున్నాయి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కొంత డబ్బులు ఇచ్చినా ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దుర్భాషలాడుతున్నారని మండిపడుతున్నారు. కాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో స్థానికంగా వెలుగులోకి వచ్చింది.