సత్తెనపల్లి: సాధారణ పౌరుడిలా టీ తాగిన మంత్రి మనోహర్
సాధారణ పౌరుడిలా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రవర్తించిన తీరు ప్రజలను ఆకర్షించింది. గురువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రైస్ మిల్లు తనిఖీల కోసం ఆయన వెళ్లారు. సత్తెనపల్లిలో రోడ్డు పక్కనే కారు ఆపించి అక్కడ ఉన్నా ఓ బడ్డీ కొట్టు వద్ద టీ తాగటంతో ఆయన ప్రవర్తించిన తీరును చూసి ప్రజలు సంతోషించారు. అక్కడ సామాన్యులను పలకరించి నిత్యావసర ధరలపై ఆరా తీసి, ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు.