రాజుపాలెం: వైన్ షాప్ వద్దంటూ మహిళల ఆందోళన

78చూసినవారు
రాజుపాలెంలో ప్రైవేటు మద్యం షాపు పెట్టిన క్రమంలో బుధవారం మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ జనసంచారం ఉన్న ప్రదేశంలో, పాఠశాల ఉన్న ప్రదేశంలో మద్యం షాపు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మద్యం తాగి మందుబాబులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారని, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వెంటనే ఆ మద్యం షాపు తీసివేయాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్