కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. సోమవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ 'పవన్ వెళ్లిన బోటులో కస్టమ్స్ అధికారి, పోర్టు అధికారి ఇద్దరూ ఉన్నారు. పోర్టులోకి వెళ్లాలంటే అనుమతి ఇవ్వాల్సిన ఇద్దరు అధికారులు ఆయనతోనే ఉన్నారు. మరి పవన్ కు పర్మిషన్ ఇవ్వనిది ఎవరు? అయితే పవన్‌ను షిప్‌లోకి ఎక్కనివ్వద్దు అని చంద్రబాబు అయినా చెప్పి ఉండాలి, లేదా పవన్ చెప్పింది అబద్ధమైనా అయ్యుండాలి.' అని అన్నారు.