విశాఖ డెయిరీ యాజమాన్యం తగ్గించిన ఆవు పాలు ధర పెంచకపోతే పోరాటం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రాపు సూర్యనారాయణ అన్నారు. బొబ్బిలి గంటి ప్రసాదం భవనంలో బుధవారం పాలు ధర పెంచాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆవు పాలు ధర తగ్గించడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పాలు ధర పెంచాలని డిమాండ్ చేశారు. విశాఖ డెయిరీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.