సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేసేందుకు చొరవ తీసుకోవాలని శుక్రవారం బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన ఎమ్మార్పీఎస్, ఎమ్ఈఫ్ సభ్యులు బొబ్బిలి కోటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు(బేబీ నాయన)కు వినతిపత్రం అందించారు. త్వరలో రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యేలా చూడాలని కోరారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని తెలిపారు.