విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ సోమవారం పర్యటించారు. కలుషిత నీటి ప్రభావంతో అతిసారం బారినపడి ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను ఉప ముఖ్యమంత్రి పరామర్శించారు. గుర్ల గ్రామంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.