చీపురుపల్లి నియోజకవర్గం గుర్ల మండలంలో డయేరియా తో మృతి చెందిన కుటుంబాలకు వైసీపీ తరఫున రెండు లక్షల చొప్పున ఎక్షగ్రేషియో ను మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. గుర్ల మండలంలో ఆయన గురువారం పర్యటించి, స్థానిక పిహెచ్సిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను పరామర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుటిల రాజకీయాలు మానుకొని ప్రజారోగ్యం పై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.