గుర్ల మండల కేంద్రంలో గత రెండు రోజుల క్రితం అతిసార వ్యాధికి గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా రోగులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యత పై నివేదికలు సమర్పించాలని ఆయన కోరారు.