మెరకముడిదాంలో కార్తీక వైభవం.. పోటెత్తిన భక్తులు

61చూసినవారు
భక్తులు పరమ పవిత్రంగా భావించే కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా మెరకముడిదాం మండలంలోని మెరకముడిదాం, సోమలింగాపురం, గర్భాం ప్రముఖ శివాలయాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వేకువజామున నుంచి అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మండల కేంద్రంలోని శివాలయంలో మహిళా భక్తులు ఆలయ పరిసరాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయ పరిసరాలు భక్తుల శివనామస్మరణతో మార్మోగిపోయాయి.

సంబంధిత పోస్ట్