గుర్ల: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గరికవలస విద్యార్థులు
పల్నాడు జిల్లా కారంపూడిలో జరగనున్న రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు గుర్ల మండలం గరికవలస జడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు పీఈటి మల్లికార్జునరావు గురువారం తెలిపారు. తమ పాఠశాల నుండి ఇద్దరు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఈ పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచాలని పాఠశాల సిబ్బంది ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.