గరికివలస: గుండె పోటుతో గ్రామ కార్యదర్శి మృతి
గుర్ల మండలం గరికవలస గ్రామానికి చెందిన బి అప్పలనాయుడు (30) మంగళవారం గుండె పోటుతో మృతి చెందారు. ఈయన ప్రస్తుతం మెరకముడిదాం మండలంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన గతంలో గరివిడి, గుర్ల మండలాల్లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసినట్లు చెప్పారు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్పలనాయుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.