తమ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని గుర్ల మండల 108 సిబ్బంది సోమవారం ఎంపీపీ పొట్నూరు ప్రమీలకు వినతిపత్రం అందజేశారు. అరబిందో యాజమాన్యం 108 ఉద్యోగుల నుండి అక్రమంగా వసూలు చేసిన పిఎఫ్ తిరిగి ఇవ్వాలని కోరారు. 108 ఉద్యోగులను ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రభుత్వం పీహెచ్సీల ద్వారా 108 ఉద్యోగులను వినియోగించుకోవాలని కోరారు. సకాలంలో జీతాలు చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.