విజయనగరం జిల్లా గజపతినగరం మల్లపు చెరువు వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకొని స్వచ్ఛతే సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువు వద్ద గల పిచ్చి మొక్కలను ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తవుడు, గజపతినగరం సర్పంచ్ నరవ కొండమ్మలు తొలగించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఈవో మంత్రి రమణ తదితరులు పాల్గొన్నారు.