దేవుపల్లి: సెంచూరియన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు

70చూసినవారు
దేవుపల్లి: సెంచూరియన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
సెంచూరియన్ విశ్వవిద్యాలయం ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఉద్దేశించిన హెల్త్ కేర్ ఆన్ వీల్స్ కార్యక్రమాన్ని వైస్ ఛాన్స్ లర్, ప్రొఫెసర్ ప్రశాంత్ కుమార్ మహంతి ప్రారంభించారు. శుక్రవారం విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో సుమారు 200 మంది రోగులకు వైద్య పరీక్షలు జరిపారు. రోగులకు ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట శివానంద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్