గాలికుంటు వ్యాధి టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

58చూసినవారు
గాలికుంటు వ్యాధి టీకాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
పశువులలో వచ్చే గాలికుంటు వ్యాధి నివారణకు రైతులు సకాలంలో టీకాలు వేయించుకోవాలని సర్పంచ్ లెంక చిన్నం నాయుడు అన్నారు. బుధవారం గజపతినగరం మండలం పాతబగ్గాo గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ. పాలిచ్చే గేదెలకు, ఆవులకు గాలికుంటు వ్యాధి సోకినట్లయితే పాలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉందని అన్నారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్