మెంటాడ మండలంలోని పెదమేడపల్లి గ్రామంలో జరిగిన క్రిస్మస్ వేడుకలలో మాజీ మంత్రి పీడిక రాజన్న దొర బుధవారం పాల్గొన్నారు. ఈ క్రిస్టమస్ వేడుకల్లో రాజన్న దొర కేక్ కట్ చేసి పంచిపెట్టారు. అనంతరం గ్రామంలో ఉన్న పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏసుక్రీస్తు ప్రజలకు దయ కరుణ వంటి సుగుణాలను అందజేశారని తెలిపారు.