గజపతినగరంలోని శ్రీరామ క్షేత్రం జంక్షన్ లో గల కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి నవనీతోత్సవం వైభవంగా జరిపారు. ధనుర్మోత్సవంలో భాగంగా శనివారం ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు భూ సమేత వేంకటేశ్వర స్వామి వారికి 30 కిలోల వెన్నతో అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ గా వించారు.