పారిశుద్ధ్య పనులపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని జామి ఎంపీడీవో అప్పలనాయుడు కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కుమరాం, బలరాంపురం తదితర పంచాయతీలలో బుధవారం ఆయన పర్యటించారు. అనంతరం ఆయా గ్రామాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. పంచాయతీ సిబ్బంది శానిటేషన్, క్లోరినేషన్ పై శ్రద్ధ వహించాలని తెలిపారు. పారిశుధ్యం పై ఎప్పటికప్పుడు తనకు నివేదిక అందించాలని ఆదేశించారు.