విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొల్లపాలెం పంచాయతీ పరిధిలో గల శివారు గ్రామాలకు ఇళ్ల వద్దకే వచ్చి పింఛన్లు అందించాలని సిపిఎం మండల కార్యదర్శి తొత్తడి పైడిపునాయుడు మంగళవారం డిమాండ్ చేశారు. ఎర్రడ్లవలస, చిన్న గూడెం గ్రామాలకు చెందిన గిరిజనులు సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కార్యదర్శి పద్మ స్పందిస్తూ సిగ్నల్ ఉన్న దగ్గరికి వెళ్లి పింఛన్లు అందజేస్తామన్నారు.