ఆండ్ర జలాశయం సాగునీటి ప్రాజెక్టు చైర్మన్ గా సతీష్ కుమార్ శనివారం నియమితులు అయ్యారు. టిడిపిలో క్రియాశీలక సభ్యునిగా ఉన్న తనకి పదవి వరించడం ఆనందంగా ఉందన్నారు. మంత్రులు శ్రీనివాసరావు, సంధ్యారాణికు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బాధ్యతను దృష్టిలో పెట్టుకొని రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని కాలువల్లో పేరుకుపోయిన మట్టిని, నాచును తొలగించి ప్రాజెక్టు కింద ఉన్న భూములకు సాగునీరు అందడానికి తన వంతు కృషి చేస్తానన్నారు.