బొండపల్లి: అదుపు తప్పిన బైక్.. వ్యక్తికి తీవ్రగాయాలు

62చూసినవారు
విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రోల్లవాక సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి పడిపోవడంతో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి యస్. కోట బర్మా కోలనికి చెందిన తగరంపూడి అప్పారావుగా పోలీసులు గుర్తించారు. బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్