గుమ్మలక్ష్మీపురం గ్రామ సచివాలయంలో ఆధార్ సేవలు నేడు సోమవారం నుంచి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పునఃప్రారంభం కాబోతున్నాయని సచివాలయ సెక్రెటరీ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున గ్రామ ప్రజలు ఈ సేవలను వినియోగించుకోగలరని తెలిపారు. అయితే వచ్చేటప్పుడు ఆధార్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన పత్రాలను, పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా తీసుకురావాల్సిందిగా డిజిటల్ అసిస్టెంట్ సందీప్ తెలిపారు.