విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ

80చూసినవారు
విజయవాడ వరద బాధితులకు విరాళాల సేకరణ
మన్యం జిల్లా, కురుపాం మండలం నీలకంఠాపురం గ్రామస్థులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం ట్రైబుల్ రైట్ ఫోరమ్ ఆధ్వర్యంలో శనివారం విరాళాలు సేకరించారు. వరదల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులు అయ్యారని, ఈ విషయం ఎంతగానో బాధించిందని గ్రామస్థులు అన్నారు. తమ గ్రామం తరఫున కొంత నగదు, 7క్వింటాళ్ల బియ్యాన్ని సేకరించి వరద బాధితులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సై నీలకంఠరావు, సర్పంచ్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్