హాస్టళ్ల లో సిక్ రూమ్స్ తప్పనిసరిగా ఉంచాలని మన్యం జిల్లా సహాయ మలేరియా అధికారి సూర్యనారాయణ అన్నారు. గురువారం డోకిశీల గిరిజన సంక్షేమ హాస్టల్ లో జరిగిన ఫోకల్ స్ప్రేయింగ్ ను సందర్శించిన ఆయన ఇటీవల మలేరియా కు గురైన కార్తీక్ (9సం)విద్యార్థికి జరిగిన చికిత్స గురించి ఆరా తీశారు. హాస్టల్ లో సిక్ రూమ్ కు, కిటికీలకు మెష్ లు బిగించాలని, పరిశుభ్రత పాటించాలని సూచించారు.