9న పార్వతీపురంలో జాబ్ మేళా

55చూసినవారు
9న పార్వతీపురంలో జాబ్ మేళా
జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీన నిర్వహిస్తున్నట్లు మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాను ఉదయం 10 గంటల నుండి పార్వతిపురం ఐటిడిఏ గిరిమిత్ర సమావేశం మందిరంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబ్ మేళాకు కేఎల్ గ్రూప్ - అమెజాన్ సంస్థ హాజరవుతుందని చెప్పారు. రెండు వందల ఉద్యోగాలను సంస్థ నియామకం చేయనుందని ఆయన వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్