కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజలకు, కార్యకర్తలకు రేపు శనివారం అందుబాటులో ఉండరని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది లోవరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలో జరిగే ఏపీడబ్ల్యూజే 67 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారని కావున ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు. కురుపాం నియోజకవర్గ నాయకుల్లు, కార్యకర్తలు, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.