కొమరాడ మండలం గుమడ గ్రామం వద్ద అంతర్ రాష్ట్ర రహదారిపై ఏర్పడిన గోతులలో వర్షం నీరు నిల్వ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వాహన చోదకులు మంగళవారం తెలిపారు. ఈ రహదారిలో నిత్యం వందలాది భారీ వాహనాలతో పాటు రాయగడ మజ్జి గౌరమ్మ గుడికి వెళ్లే భక్తులు కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలలో ప్రయాణం చేస్తుంటారన్నారు. రహదారిపై వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు స్పందించాలని కోరుతున్నారు.