ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 134 వినతులు అందినట్లు పార్వతీపురం మన్యం జిల్లా రెవెన్యూ అధికారి కె. హేమలత పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గల పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ఆమె ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ రిసెప్షన్ సెంటర్ నుండి పలు ప్రాంతాల నుంచి వచ్చిన 134 మంది అర్జీదారుల నుంచి ఆమె వినతులను స్వీకరించారు.