వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

79చూసినవారు
వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
కొమరాడ మండలం పెదమార్కొండపుట్టిలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు వర్షం నీటితో ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షానికి కూడా పాఠశాల ఆవరణలో నీరు నిల్వ ఉంటోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. దీంతో తరగతి గదిలోకి ప్రవేశించేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, నీటిలో జారిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని శుక్రవారం డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్