ప్రజలందరూ తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. శనివారం చేపల కంచేరు, రెడ్డి కంచేరు, ముక్కాం గ్రామాలను సందర్శించారు. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక జారీ చేయడంతో మత్స్యకారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా సముద్రంలోకి వెళ్లవద్దని కోరారు. మత్తు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబరు మోసాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు.