సాధన సభ్యులు జౌదార్యం

81చూసినవారు
సాధన సభ్యులు జౌదార్యం
నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేటకు చెందిన సాధనా యువజన సంఘం సభ్యులు అరుదైన ఏబీ పాజిటివ్ రక్తాన్ని దానం చేశారు. నెల్లిమర్ల పట్టణంలోని మిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న ఆరేళ్ళ చిన్నారి రోహిణికి అత్యవసరంగా ఏబీ పాజిటివ్ రక్తం అవసరమైంది. సాధనా ప్రతినిధులు దాతలు గర్భపు శ్రీను, మద్దిల రాంబాబును సంప్రదించారు. స్పందించిన దాతలు ఇరువురూ రక్తదానానికి ముందుకొచ్చారు.

సంబంధిత పోస్ట్