ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ గ్రామపంచాయతీలు తీర్మానం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు బుధవారం పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో కే. రామ్మూర్తి నాయుడు ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 23న రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామపంచాయతీల సమావేశాల్లో రైతుల పక్షాన తీర్మానం చేయాలని సూచించారు.