జిల్లా పరిషత్తు వద్ద రైతు సంఘం ఆందోళన

57చూసినవారు
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. నారాయణపురం కుడి ప్రధాన కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు ఎందుకు ప్రభుత్వం అందించడం లేదో తక్షణమే రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపురం ఆయకట్టు ప్రాంతాలలో గల సమస్యలను వివరించారు. రైతులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్