మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఇటీవల కాలంలో చినుకు కోసం ఎదురుచూసిన స్థానిక వాసులకు భారీ వర్షం పడడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. గురువారం కురిసిన ఈ వాన ఎంతో ఉపయోగపడుతుందని ఖరీఫ్ సాగుకు తోడ్పడుతుందని రైతులు అన్నారు. గత రెండు నెలలుగా వాన చుక్క లేకపోవడంతో వర్షం కోసం ఎదురు చూసే సమయంలో ఈ వర్షం పడడంతో ఒక్కసారిగా వాతావరణం మారి చల్లబడింది.