సాలూరు అన్న క్యాంటీన్ భోజనం అందించేందుకు రాష్ట్ర మహిళా శిశుసంక్షేమశాఖ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో అన్న క్యాంటీన్ నిర్మాణానికి బుధవారం మంత్రి శంకుస్థాపన చేశారు. 60 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు నెలకొల్పుతున్నట్లు మంత్రి తెలిపారు.