విద్యా వైద్యానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. మన్యం జిల్లా ఆసుపత్రి వద్ద బుధవారం రాత్రి మహాప్రస్థానం వాహనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామాలకు మృతదేహాలను తరలించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుందని దానిని గమనించి అధికారులతో చర్చించి మహాప్రస్థానం వాహనాన్ని సిద్ధం చేయడం జరిగిందన్నారు.