వసతి గృహ విద్యార్థులు సీజనల్ వ్యాధులకు గురికాకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి(డిఎంఓ) డా టి. జగన్మోహనరావు సూచించారు. జోగింపేట లో గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని(ఎస్ఓఈ)శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ పరిసరాల్లో సందర్శించి వాడుక నీరు, వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలన్నారు.