భక్తిశ్రద్ధలతో గృహాలలో వరలక్ష్మి పూజలు

63చూసినవారు
భక్తిశ్రద్ధలతో గృహాలలో వరలక్ష్మి పూజలు
శ్రావణమాసం రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భముగా రాజాం పట్టణములో ప్రజలు భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవికి పూజలను నిర్వహించారు. శుక్రవారం ప్రాత కాలంలో అమ్మవారికి వివిధ రకాల పిండి వంటలతో వివిధ వర్గాల పుష్పాలు పండ్లతో అర్చన కార్యక్రమాలను నిర్వహించారు. సమీప అమ్మవారి ఆలయాలలోకి వెళ్లి కుటుంబ సభ్యుల పేరిట క్షేమాన్ని ఆకాంక్షిస్తూ పూజలను నిర్వహించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రత కథను ఆలకించారు.

సంబంధిత పోస్ట్