నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు అంగన్వాడీల జిల్లా ఉప కార్యదర్శి బలగ రాధ సోమవారం ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 28 రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మెను చేశామని తెలిపారు. ఈ సమ్మెను కొన్ని అనివార్య కారణాల వలన అంగన్వాడీల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సోమవారం నుండి విరమింప చేస్తూ విధుల్లోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు.