మెంటాడ మండలం జయతి గ్రామంలో టిబి,క్షయ వ్యాధి పై అవగాహన కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. శుక్రవారం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులకు క్షయ వ్యాధిబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. బరువు తగ్గిపోవడం ఆయాసం రావడం తగ్గినప్పుడు కఫంతో రక్తం పడటం వంటి లక్షణాలు ఉంటే పరీక్ష చేయించుకోవాలని కోరారు.